షూటింగ్‌లో సూర్యకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

షూటింగ్‌లో సూర్యకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
Cinema News

తమిళ్ హీరో సూర్యకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన చిత్రయూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం కంగువ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంద . షూటింగ్ లో భాగంగా ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా కెమెరా ఆయన మీద పడిందని సమాచారం. కెమెరా మీదపడటంతో సూర్య భుజానికి గాయం అయ్యింది.

షూటింగ్‌లో సూర్యకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
Surya

సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్నది . ఆయన సినిమాలకు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. దాంతో సూర్య నటించిన ప్రతి మూవీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం సూర్య కంగువ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ ఈ మూవీ కు దర్శకత్వం వహిస్తున్నాడు.