దిగొచ్చిన సైరా టీం.. సాయంకు సిద్దం….!

Sye Raa Team Supprted In Uyyalawada Family

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిటీష్‌ కాలంలో స్వాతంత్య్ర ఉద్యమంను నడిపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్‌ వారి సైన్యంపై పలు సార్లు యుద్దంకు దిగాడు. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం అయిన ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే చిన్న చిన్న అడ్డంకులు ఈ చిత్రానికి ఎదురవుతూ ఉన్నాయి. మొదట ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ లీక్‌ అవ్వడం జరిగింది. నష్ట నివారణ చేపడుతున్న సమయంలోనే తెలంగాణ రెవిన్యూ అధికారులు అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో షూటింగ్‌ జరుపుతున్నారు అంటూ సెట్‌ను కూల్చి వేశారు. ఇప్పుడు ఉయ్యాలవాడ ఫ్యామిలీ మీడియాకు ఎక్కింది.

చిరంజీవి తమ ఫ్యామిలీ గురించి సినిమా చేయడం సంతోషంగా ఉంది, కాని సినిమా చేస్తున్న సమయంలో తమ అనుమతి తీసుకుని ఉంటే బాగుండేది అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యాలవాడ ఫ్యామిలీకి చెందిన కొందరు తాజాగా ఒక మీడియా ఛానెల్‌ స్టూడియోలో కూర్చున్నారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకొచ్చారు. దాంతో మీడియాలో ఉయ్యాల వాడ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌లను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు కాని, తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు అంటూ ఉయ్యాలవాడ ఫ్యామిలీ వారు వాపోతున్నారు. తమ కుటుంబంకు చెందిన పెద్ద వ్యక్తి గురించి సినిమా తీస్తున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికి, అందుకు మమ్ములను పట్టించుకోక పోవడం బాధాకరం అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులను సంప్రదించడం జరిగింది. వారికి తప్పకుండా ఆర్థిక సహకారంతో పాటు అన్ని విధాలుగా సాయంగా ఉంటామని చెప్పుకొచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేస్తామని మెగా హామీ దక్కినట్లుగా తెలుస్తోంది. ఉయ్యాలవాడ ఫ్యామిలీకి చెందిన పలువురు ప్రస్తుతం పేదరికంలో ఉన్నారు. రోజువారి కూలి పని చేసుకుని బతికేస్తున్నారు. వారికి ఆర్థిక సాయం చేయడం అనేది మంచి ఆలోచన అంటూ సినీ వర్గాల వారు కూడా అభినందిస్తున్నారు.