బెల్లంకొండకు ఓకే, రాజశేఖర్‌కు నో.. కారణం ఏంటో…………..?

Kajal Not Interested In Rajashekar

టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించేసిన ముద్దుగుమ్మ కాజల్‌ ప్రస్తుతం చిన్న హీరోలతో వరుసగా చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కళ్యాణ్‌ రామ్‌తో ‘ఎమ్మెల్యే’, రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాల్లో నటించిన కాజల్‌ ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో మరియు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో కాజల్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వరుసగా చిన్న చిత్రాల్లో నటిస్తూ చిన్న హీరోలతో నటించేందుకు ఓకే చెబుతున్న కాజల్‌ తాజాగా రాజశేఖర్‌తో మాత్రం నటించేందుకు నో చెప్పింది. పెద్దగా బిజీగా లేని కాజల్‌ తాను వరుసగా చేస్తున్న చిత్రాల కారణంగా డేట్లు ఇవ్వలేను అంటూ తేల్చి చెప్పిందట.

గరుడవేగ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ‘అ!’ చిత్రంతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా రాజశేఖర్‌ కోసం కాజల్‌ను సంప్రదించడం జరిగిందట. రాజశేఖర్‌తో నటించేందుకు ఆసక్తిగా లేను అని, తాను ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా ఉన్నాను అంటూ తేల్చి చెప్పిందట. దాంతో దర్శకుడు వేరే హీరోయిన్‌ వేటలో ఉన్నాడు. రాజశేఖర్‌ మరియు జీవితల గురించి ఈ మద్య కాలంలో మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. దాంతో ఆయన సినిమాలో నటించేందుకు కాజల్‌ ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి రాజశేఖర్‌తో నటించేందుకు కాజల్‌ నో చెప్పడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి బచ్చ హీరోతో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.