జీవిత, రాజశేఖర్‌… చెరో మాట!

jeevitha rajasekhar reveals to cold war with Chiru

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్‌ చిరంజీవితో జీవిత రాజశేఖర్‌కు గొడవ అయిన విషయం తెల్సిందే. ఆ గొడవ కారణంగా చాలా సంవత్సరాల పాటు చిరంజీవితో జీవిత రాజశేఖర్‌లు మాట్లాడలేదు. మెగా ఫ్యామిలీతో పూర్తి దూరంగా రాజశేఖర్‌ దంపతులు ఉంటూ వచ్చారు. తాజాగా మెగాస్టార్‌తో సన్నిహితంగా మొగుతున్నారు. ‘గరుడవేగ’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రాజశేఖర్‌ దంపతులు చిరంజీవిని కలిసిన విషయం తెల్సిందే. గరుడవేగకు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేసి, సినిమా సక్సెస్‌ అవ్వాలంటూ కోరుకోవడం జరిగింది. చిరంజీవితో రాజశేఖర్‌ దంపతుల భేటీతో ఇరు కుటుంబాల మద్య విభేదాలు తొలగిపోయినట్లే అని అంతా అనుకుంటున్నారు.

తాజాగా జీవిత మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి గారితో విభేదాలు మీడియా సృష్టి, అసల మా మద్య ఎలాంటి విభేదాలు లేవు. మీడియా వారు విభేదాలను పుట్టించారు, చిరంజీవి గారితో తాము ఎప్పుడు కూడా గొడవ పడలేదు అంటూ జీవిత చెప్పుకొచ్చింది. జీవిత ఆ మాటలు చెప్పిన మూడు నాలుగు రోజుకే రాజశేఖర్‌ ఆమె మాటకు పూర్తి విరుద్దమైన మాటలు మాట్లాడటం జరిగింది. రాజశేఖర్‌ తాజాగా గరుడవేగ చిత్రం సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ గతంలో చిరంజీవితో విభేదాలు ఉన్న మాట నిజమే, ఆయనతో మాట్లాడాలని భావించలేదు. కాని ఎప్పుడు అలాగే ఉండలేం కదా, మళ్లీ కలుసుకోకూడదా అంటూ రాజశేఖర్‌ అన్నాడు. రాజశేఖర్‌ మాట ప్రకారం అయితే చిరంజీవితో ఈ దంపతులు గొడవ పడ్డ మాట వాస్తవమే, కొన్నాళ్ల పాటు చిరంజీవితో ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉన్న విషయం కూడా నిజమే అని తేలిపోయింది. పాపం జీవిత అలా చెబితే రాజశేఖర్‌ ఇలా చెప్పి ఆమె గాలి తీసేశాడు.