గుర్తు పట్టారా.. నవ్వించేందుకు మళ్లీ వస్తున్నాడు

Comedian Sudhakar Makes A Comeback

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పర్చుకున్న కమెడియన్‌ సుధాకర్‌. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సీనియర్‌ హీరోలతో సినిమాలు చేసి అప్పట్లో హీరోల స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న సుధాకర్‌ ఇటీవల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకోలేక పోతున్నాడు. చిరంజీవితో కెరీర్‌ ఆరంభంలో కలిసి తిరిగిన సుధాకర్‌ను ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ మద్య తీవ్ర అనారోగ్యంకు గురైన సుధాకర్‌ను కొందరు చనిపోయారు అంటూ ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాలో సుధాకర్‌ చనిపోయాడు అంటూ వచ్చిన వార్తలను ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి కొట్టి పారేయాల్సి వచ్చింది. తాజాగా సుధాకర్‌ కమ్‌ బ్యాక్‌ ఇస్తున్నాడు.

Telugu film comedian Sudhakar makes a comeback

చాలా గ్యాప్‌ తర్వాత కనిపించిన సుధాకర్‌లో అప్పటి ఫేస్‌ క లేదు. దాంతో సినీ వర్గాల వారు ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అనారోగ్య కారణంగా బక్కగా అయిన సుధాకర్‌ మళ్లీ ఇప్పుడు మునుపటి రూపంను పొందాడు. దాంతో మళ్లీ ఈయనకు ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సుధాకర్‌ తమిళంలో కూడా రెండు మూడు సినిమాలు కమిట్‌ అయ్యాడు. లుక్‌ మార్చడంతో పాటు కామెడీ స్టైల్‌ కూడా మార్చడంతో సుధాకర్‌ మరికొన్నాళ్లు ఖచ్చితంగా అలరిస్తాడు అనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. పైన మీరు చూస్తున్న ఫొటోలో సుధాకర్‌ను గుర్తు పట్టలేకుండా ఉన్నారు కదా. గడ్డంతో పాటు ఆ కాస్ట్యూమ్స్‌ సుధాకర్‌కు బాగా సూట్‌ అయ్యాయి అంటూ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.