కాజల్‌తో కలిసి వచ్చింది

kalyan ram mla movie big craze in kagal heroine

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌ ఆరంభం నుండి భారీ కమర్షియల్‌ సక్సెస్‌లను దక్కించుకోవడంలో సఫలం కాలేక పోయాడు. ఇప్పటి వరకు కళ్యాణ్‌ రామ్‌కు హీరోగా బిగ్‌ కమర్షియల్‌ హిట్‌ పడినది లేదు. అయినా కూడా నిరుత్సాహ పడకుండా కళ్యాణ్‌ రామ్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా కళ్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం ‘ఎమ్మెల్యే’. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘ఎమ్మెల్యే’ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. కళ్యాణ్‌ రామ్‌, కాజల్‌ల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కళ్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రాలన్నింటిలో ఈ చిత్రం అత్యధిక క్రేజ్‌ను దక్కించుకుంది. కాజల్‌ హీరోయిన్‌ అవ్వడం వల్ల ఈ సినిమా స్థాయి అమాంతం పెరిగిందని చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం ఏకంగా 22 కోట్లకు అమ్ముడు పోయింది. థియేట్రికల్‌ రైట్స్‌ మాత్రమే కాకుండా ఆన్‌ లైన్‌ రైట్స్‌ మరియు ఇతర రైట్స్‌ ద్వారా మరో 8 కోట్లు వసూళ్లు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 10 కోట్లకు కాస్త అటు ఇటు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 30 కోట్ల బిజినెస్‌ను చేయడం అందరికి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో కళ్యాణ్‌ రామ్‌ సినిమా ఆడినది లేదు. అయినా కూడా 5 కోట్లకు ఓవర్సీస్‌ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ కొనుగోలు చేసిందంటే అది ఖచ్చితంగా కాజల్‌ కారణంగానే అనే విషయం అంతా ఒప్పుకోవాల్సిందే.