ఓటీటీలోకి ‘బాలకృష్ణ ’.. ఫాన్స్ కి పండగే ..!

ఓటీటీలోకి ‘బాలకృష్ణ ’.. ఫాన్స్ కి పండగే ..!
Cinema News, entertainment

Balakrishna : నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మొట్టమొదటి సారి తెరకెక్కిన సినిమా “భగవంత్ కేసరి” గత వారమే థియేటర్ లలోకి విడుదలయ్యి ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందనను దక్కించుకున్నది . ఇందులో బాలకృష్ణ తో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ వంటి నటీనటులు నటించి అందరిని మెప్పించారు.

 ఓటీటీలోకి ‘బాలకృష్ణ ’.. ఫాన్స్ కి పండగే ..!
Balakrishna

అయితే… నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంతత్ కేసరి సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని టాక్. నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టాక్.