కల్కి సినిమా కోసం ఏంటో ఎదురు చూస్తున్నా – కాజల్ అగర్వాల్!

What are you waiting for the movie Kalki - Kajal Aggarwal!
What are you waiting for the movie Kalki - Kajal Aggarwal!

రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా వరల్డ్ సినిమా కల్కి 2898ఏ. డి జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార మూవీ ల పై మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా కల్కి 2898AD సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

జూన్ 7 వ తేదీన కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ మూవీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. రిలీజ్ కు రెడీ అవ్వడంతో,మూవీ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రభాస్ ది, కాజల్ అగర్వాల్ ది బెస్ట్ పెయిర్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ల తో తెలుగు ప్రేక్షకులని , అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నారు. ఒకే నెలలో సత్యభామ, కల్కి మూవీ లు రిలీజ్ అవుతుండటం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా, ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్లు ఆమె తెలిపారు.

What are you waiting for the movie Kalki - Kajal Aggarwal!
What are you waiting for the movie Kalki – Kajal Aggarwal!

ఒక నటిగా సత్యభామ మూవీ విషయం లో ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందరి అభిమానులు లాగానే, కల్కి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రచార మూవీ లు అన్నీ ఆకట్టుకున్నాయి అని, మూవీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తేగా వైరల్ గా మారాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, దిశా పటాని లు ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కూడా కీలక పాత్రల ల్లో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు.