కాజల్ “సత్యభామ” ట్రైలర్: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ థ్రిల్లర్!

Kajal's
Kajal's "Satyabhama" trailer: Action thriller with thrilling elements!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 31, 2024 న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది . రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. తాజాగా సత్యభామ థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.

Kajal's "Satyabhama" trailer: Action thriller with thrilling elements!
Kajal’s “Satyabhama” trailer: Action thriller with thrilling elements!

హీరోయిన్ కాజల్ అగర్వాల్ రోల్ బాగా అలరిస్తుంది. చాలా పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి శశి కిరణ్ తిక్క కథా రచయితగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు .