గేమ్ చేంజర్ లో హీరోయిన్ ఎవరో తెలుసా ?

Do you know who the heroine is in Game Changer?
Do you know who the heroine is in Game Changer?

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ లో తెలుగు హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తుంది . ఐతే, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రమోషన్స్ లో అంజలి ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ గురించి కూడా స్పందించారు. ‘‘గేమ్‌ ఛేంజర్‌లో నేను కీ రోల్‌కే పరిమితం కాదు. అందులో నేనో హీరోయిన్‌. కానీ ఈ మూవీ లో నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తానని వార్తలు రాస్తున్నారు. నా పాత్ర గురించి మేకర్స్‌ అలా ప్రకటించలేదు కదా. నా పాత్రకి సంబంధించి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, ఒక అందమైన పాట ఉంటాయి. ఇంతకుమించి నేను ఏం చెప్పలేను’’అని అంటూ అంజలి చెప్పుకొచ్చింది.

Do you know who the heroine is in Game Changer?
Do you know who the heroine is in Game Changer?

కాగా ఈ మూవీ లో శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ లో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నారు . ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కు వెళ్ళింది. అందుకే, శంకర్ కూడా చరణ్ మూవీ ని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు.