భోగ‌న్ రీమేక్ లో మాస్ మ‌హారాజ‌

Ravi Teja New Movie Trailer Release On 29th

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

ఏడాది కాలంగా సినిమాల‌కు విరామం ఇచ్చిన మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ మ‌ళ్లీ బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు సినిమాల్లో న‌టిస్తున్నాడు. రాజా ది గ్రేట్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌యింది. ట‌చ్ చేసి చూడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా త‌రువాత మ‌రో కొత్త చిత్రాన్ని అంగీక‌రించాడు ర‌వితేజ‌. త‌మిళ‌నాడులో బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన భోగ‌న్ తెలుగు రీమేక్ లో న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. భోగ‌న్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లక్ష్మణే… తెలుగులో కూడా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌డుతున్నాడు.

అయితే తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ‌ను మార్చ‌నున్నారు. ప‌వ‌న్ సాధినేని ప్ర‌స్తుతం భో్గ‌న్ క‌థ‌ను తెలుగీక‌రించే ప‌నిలో ఉన్నాడు. భోగ‌న్ లో  జ‌యం  ర‌వి హీరోగా న‌టించారు. సీనియ‌ర్ న‌టుడు అర‌వింద్  స్వామి మ‌రో  ప్ర‌ధాన పాత్ర పోషించారు. తెలుగులో ఈ పాత్ర‌ను రోనిత్ రాయ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ను ఖ‌రారు చేయ‌లేదు. చివ‌ర‌గా ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్ 2015లో విడుద‌ల‌యింది. ఏడాదిన్న‌ర‌గా ఆయ‌న సినిమా ఒక్క‌టి కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు.  ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌టంతో గ‌తంలోలానే….ఆయ‌న చిత్రాలు పెద్ద గ్యాప్ లేకుండా వెంట‌వెంట‌నే రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంది