వైట్ల టైటిల్‌ ఫిక్స్‌.. రవితేజ టెన్షన్‌

ravi-teja-and-srinu-vaitla-new-movie-title-amar-akbar-antony

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అట్టర్‌ ఫ్లాప్‌ల్లో హ్యాట్రిక్‌ను క్రాస్‌ చేసిన శ్రీనువైట్ల తర్వాత సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ‘మిస్టర్‌’ చిత్రం తర్వాత శ్రీనువైట్లకు ఏ హీరో కూడా డేట్లు ఇవ్వడని అంతా భావించారు. కాని రవితేజ తనకు హిట్స్‌ ఇచ్చిన గౌరవం మరియు అభిమానంతో శ్రీనువైట్లకు మరో ఛాన్స్‌ ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యాడు. శ్రీవైట్ల నిర్మాణ భాగస్వామిగా ఉండి మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘మిస్టర్‌’ వల్ల చాలా లాస్‌ అయిన శ్రీనువైట్ల ఈ సినిమా కోసం ఉన్నది పెడుతున్నాడు. రవితేజతో ఒక విభిన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కొత్త తరహాలో తెరకెక్కించేందుకు శ్రీనువైట్ల ప్లాన్‌ చేస్తున్నాడు.

శ్రీనువైట్ల సాదారణంగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు చూడటం లేదు. ఇక కొత్తగా తెరకెక్కిస్తే ఎవరు చూస్తారు అంటూ కొందరు సినీ వర్గాల వారు స్వయంగా అంటున్నారు. వెంకీ, దుబాయిశ్రీను చిత్రాలతో రవితేజకు స్టార్‌డం తెచ్చి పెట్టిన దర్శకుడు శ్రీనువైట్ల అదే తరహాలో ఒక మంచి కథతో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. తాజాగా ఆ సినిమాకు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాడు. ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తాడు లేదా ఒకే పాత్ర సీన్స్‌ను బట్టి మూడు విభిన్న గెటప్‌లలో కనిపించబోతున్నట్లుగా టైటిల్‌ను చూస్తుంటేనే అర్థం అవుతుంది. సహజంగా అయితే ఇలాంటి కాన్సెప్ట్‌పై నమ్మకం పెట్టుకోవచ్చు. కాని శ్రీనువైట్ల అవ్వడం వల్ల ఎందుకో నమ్మకం కలగడం లేదు.

ప్రస్తుతం రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం విడుదల సన్నాహాల్లో ఉన్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఆ సినిమా దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదలై సక్సెస్‌ అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో ఏమాత్రం టెన్షన్‌ లేకుండా ప్రయోగానికి రవితేజ సిద్దం అవుతాడు. కాని ఒక వేళ ‘రాజా ది గ్రేట్‌’ ఫలితం తారు మారు అయితే మరో ఫ్లాప్‌ కోసం శ్రీనువైట్లతో రవితేజ సినిమా తీస్తాడని భావించడం లేదు. ‘రాజా ది గ్రేట్‌’ సినిమా సక్సెస్‌ అయితేనే శ్రీనువైట్లకు రవితేజ డేట్లు ఇస్తాడేమో అని సినీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది.