మానని గాయాన్ని కెలుకుతున్న వెంకయ్య

Venkayya Naidu Sensational Speech On AP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏదో పెద్దమనిషిని సన్మానిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతి వెంకయ్యను పిలిచారు. అమరావతి వచ్చిన వెంకయ్యకు అపూర్వ స్వాగతం లభించింది. కానీ ఆయన మాట్లాడిన స్పీచ్ మాత్రం కాస్త ఎక్కువైంది. తానేదో ఏపీని ఉద్ధరించేసినట్లుగా ఆయన చెప్పుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడటమేంటని అంటున్నారు.

ఏపీకి ఎంతో అన్యాయం జరిగిందని, దానిని పూడ్చటానికి శ్రమించానని చెబుతున్నారు. పైగా ప్రధాని కూడా ఏపీకి వెంకయ్య ఉన్నారు, గుజరాత్ కు ఎవరూ లేరని అన్నారట. ఇంత స్వోత్కర్ష అవసరమో.. కాదో ఆయనే నిర్ణయించుకోవాలి. రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు. అడిగిన డిమాండ్ కు బీజేపీ కట్టుబడలేదు. అలాంటిది రాజ్యసభ గౌరవాన్ని పెంచుతానని వెంకయ్య చెప్పడం విడ్డూరంగా ఉంది.

ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తర్వాత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడేమో సాయం అంటున్నారు. సరే ఏదోటి ఇచ్చారా.. అంటే అదీ లేదు. ఏదో ముష్టితో సరిపెట్టి.. మళ్లీ రైల్వే జోన్ అంశాన్ని అటకెక్కించారు. ఇంత గొప్పగా రాజ్యసభను భ్రష్టుపట్టించిన ఘనత బీజేపీకే దక్కుతుంది. అలాంటిది వెంకయ్య మాత్రం ఈ పాపంలో తనకేం వాటా లేనట్లుగా చిలక పలుకులు పలకడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.