హైదరాబాద్ మెట్రో వాటర్ ఫాల్స్

Hyderabad Metro Water Fall Leakage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హైదరాబాద్ మెట్రో రైలు ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో.. వినాయక చవితి వర్షం సాక్షిగా జనానికి అర్థమైంది. గట్టిగా మూడు గంటలు కురిసిన భారీ వానకే మెట్రో స్తంభాలకు చిల్లులు పడి వాటర్ ఫాల్స్ ను తలపించే జల్లు కురిసింది. దీనిని చూసిన హైదరాబాదీలు ముందు విస్తుపోయినా.. తర్వాత సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు.

హైదరాబాద్ వాటర్ ఫాల్స్ అంటూ షేర్లు చేశారు. పైగా మెట్రో రైలు సరికొత్త పర్యాటక కేంద్రాల్ని తయారుచేస్తోందని ఎకసెక్కాలాడారు. మెట్రో వాటర్ ఫాల్స్ చూసిన అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు షరా మామూలుగా ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుని చేతులు దులుపుకున్నారు. కానీ అసలు మెట్రో స్తంభానికి బెజ్జం ఎలా పడిందని మాత్రం ఎవరూ పెద్దగా విచారణ చేయడం లేదు.

చాలామంది లాంగ్ వీకెండ్ రావడంతో సొంతూళ్లకు వెళ్లడంతో వర్షాన్ని తప్పించుకున్నారు. కానీ లేట్ నైట్లో ప్రయాణాలు చేసిన వాళ్లు మాత్రం బుక్కైపోయారు. ముఖ్యంగా హైటెక్ సిటీ దగ్గర ట్రాఫిక్ జామ్ గతంలో ఎప్పుడూ కానంత అయింది. గంట పాటు అక్కడే వాహనాలు చిక్కుకుపోయాయి. అయినా ఒక్క ట్రాఫిక్ పోలీసు కనిపించలేదు. అందరూ కలిసి పౌరుల ఖర్మానికి వాళ్లను వదిలేశారు.