ఇలియానా ఆనంద భాష్పాలు

Ileana Gets Emotional With Amar Akbar Anthony Team Receiving

తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇలియాన. ఈమె తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌లు వస్తున్న సమయంలో బాలీవుడ్‌లో ‘బర్ఫీ’ ఆఫర్‌తో ముంబయి వెళ్లి పోయింది. అక్కడ కొంత కాలం పాటు హవా కొనసాగించింది. అయితే ఈమద్య కాలంలో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఛాన్స్‌లు లేకుండా పోయాయి. దాంతో పెళ్లికి సిద్దం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా నటించాలని భావిస్తున్న తరుణంలో బాలీవుడ్‌ నుండి కాదు కాని, తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈమెకు పిలుపు దక్కింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది.

చాలా కాలం తర్వాత హైదరాబాద్‌కు షూటింగ్‌ నిమిత్తం వచ్చిన ఇలియానకు గ్రాండ్‌ వెల్‌కంను చిత్ర యూనిట్‌ పలకడం జరిగింది. ఎయిర్‌ పోర్ట్‌ నుండి షూటింగ్‌ సెట్స్‌ వరకు భారీగా ఆహ్వానం పలకడంతో పాటు, షూటింగ్‌ సెట్స్‌లో భారీ ఎత్తున వచ్చిన అభిమానుల సమక్షంలో ఆమెను సన్మానించి, చిత్ర యూనిట్‌ సభ్యులు షూటింగ్‌కు ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఆమెకు ఏర్పాటు చేసిన హోటల్‌ గది మరియు ఇతర సౌకర్యాలు కూడా రిచ్‌గా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చాలా కాలం క్రితం తెలుగు నుండి వెళ్లి పోయిన తనకు మళ్లీ ఇంతటి వెల్‌కం దక్కుతుందని ఇలియానా భావించలేదు. అందుకే ఈ ఏర్పాట్లు చూసి సెట్‌లో ఆమె ఆనందభాష్పాలు రాల్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో నటించబోతున్నందుకు ఇలియానకు భారీ పారితోషికం కూడా అందిస్తున్న విషయం తెల్సిందే.