వైఎస్ రాజారెడ్డిగా జగ్గూ భాయ్ !

Jagapathibabu to play Ys raja reddy role

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్‌. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ ని ఆనందో బ్ర‌హ్మ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే డా..వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌లో మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకి భారీ కాస్టింగ్‌ని ఎంపిక చేసుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. వైయ‌స్ విజ‌య‌మ్మ పాత్ర‌కు, ష‌ర్మిల పాత్ర‌కు, జ‌గ‌న్ పాత్ర‌కు ప‌లువురు న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌చార‌మైంది.

తాజాగా ఈ సినిమాలో అత్యంత కీల‌క‌మైన వైయ‌స్ రాజారెడ్డి (వైయ‌స్ తండ్రి) పాత్ర‌కు జ‌గ‌ప‌తిబాబుని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడట. ఫ్యాక్షనిస్టుగా గుర్తింపున్న రాజా రెడ్డి గురించి పులివెందులలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయనలో మంచి-చెడు కోణాలు రెండూ ఉన్నాయి. అందుకే ఆ పాత్ర కు జగపతి బాబు అయితే కరెక్ట్ గా సరిపోతాడని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట. అయితే జ‌గ్గూభాయ్ ఓకే చెప్పారా? లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది. మ‌హి.వి.రాఘ‌వ్ ఈ సినిమాని వ‌చ్చే ఎన్నిక‌ల ముందు అంటే జ‌న‌వ‌రిలో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.