పోకిరి సినిమా ని మిస్ చేసుకున్నం హీరోయిన్ ….. ఆమె ఎవరంటే?

పోకిరి సినిమా ని మిస్ చేసుకున్నం హీరోయిన్ ..... ఆమె ఎవరంటే?
Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది పోకిరి మూవీ . పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అదే సమయంలో వచ్చింది పోకిరి సినిమా. ఒక్కడు తర్వాత నిజం, నాని, అర్జున్, అతడు మూవీ లు చేశారు మహేష్. వీటిలో అర్జున్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అతడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆతర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. మహేష్ బాబు యాక్టింగ్.. పూరిజగన్నాథ్ డైరెక్షన్ మూవీ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. పోకిరి మూవీ లో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా నటించి మెప్పించింది. ఇక ఈ మూవీ కు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది.

పోకిరి సినిమా ని  మిస్ చేసుకున్నం హీరోయిన్ ..... ఆమె ఎవరంటే?
Mahesh Babu” Pokiri Movie”

ఇదిలా ఉంటే పోకిరి మూవీ కు ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట పూరి. ఈ డైనమిక్ డైరెక్టర్ ఎక్కువగా తన మూవీ ల్లో బాలీవుడ్ భామలు ఉండేలా చూస్తారు. ఈ క్రమంలోనే పోకిరి మూవీ కు కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఆకున్నారట. ఆమె మరెవరో కాదు కంగనా రనౌత్. పోకిరి సినిమాలో ముందుగా కంగనా రనౌత్ ను హీరోయిన్ గా అనుకున్నారట దర్శకుడు పూరిజగన్నాథ్.

పోకిరి మూవీ కోసం తనను సంప్రదించినప్పుడు గ్యాంగ్ స్టార్ అనే మూవీ చేస్తుందట కంగనా.. దాంతో పోకిరి మూవీ కు డేట్స్ అడ్జెస్ట్ కాలేదని తెలిపింది. ఆవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ అయ్యాను అని తెలిపింది కంగనా..ఇప్పటికీ పోకిరి సినిమాను మిస్ చేసుకున్నందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా అని తెలిపారు కంగనా. ప్రస్తుతం కంగనా రనౌత్ చంద్రముఖి 2లో నటిస్తుంది. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 సినిమా రిలీజ్ కానుంది.