#ట్రైలర్ టాక్: అమర్ అక్బర్ ఆంథోనీ ఆసక్తిగానే ఉంది.

“ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్లు కొందరైతే.. శక్తి మేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు” అంటూ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్ ని చూడగానే శ్రీను వైట్ల ఈసారి ఖచ్చితంగా డిఫరెంట్ గా ట్రై చేసినట్టు ఉన్నాడబ్బా అనిపించినా, ట్రైలర్ ముందుకు సాగేకొద్దీ ఇదేదో రివెంజ్ డ్రామా అనుకోవడం ఖాయం. శ్రీను వైట్ల సినిమా అంటే ఖచ్చితంగా నవ్వులు ఆశిస్తామని కాబోలు ట్రైలర్ సగం నిండా కామెడీ సన్నివేశాలు నింపేశారు. కాస్త బొద్దుగా, వెంకీ సినిమాలో కనిపించినట్టుగా ఉన్న సునీల్ ని చూస్తే సునీల్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాడేమో అని ఆశలు కూడా పెట్టేసుకుంటాం. కానీ, ఇలియానా నే మనం కలలో కూడా ఇలా అవుతుందని ఊహించినట్లుగా ఫ్యాటీ గా తయారయ్యి, అభిమానులని ఆశ్చర్యం ప్లస్ ఆందోళనలో పడేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, డైరెక్టర్ శ్రీను వైట్ల కొత్తగా చేసిందేమి లేదనే అనిపిస్తుంది. రవితేజ ని అమర్, అక్బర్ మరియు ఆంథోనీ లు అంటూ మూడు గెట్ అప్ లలో చూపించినా , అవేమి వేటికవి విరుద్ధంగా లేవు. పైపెచ్చు, రవితేజ ఇందులో మూడు పాత్రల్లో కనిపిస్తాడా లేదా అనే అనుమానం రేకెత్తిస్తుంది. ఫారిన్ లొకేషన్లు, స్టైలిష్ విలన్లు, స్టైలిష్ ఫైట్లు కనిపిస్తున్నాయి కానీ కథ మాత్రం ఆసక్తిగా సాగలేదు ట్రైలర్ లో. థమన్ సంగీతం మాత్రం డిఫరెంట్ గా ఉంది. దాదాపు 6 సవంత్సరాల తరువాత ఇలియానా ని తెలుగు లో చూస్తున్నాం అనుకొని, సంబరపడిపోతున్న ఇలియానా అభిమానుల ఆశలపై కూడా ఇలియానా బొద్దుతనం నీళ్లు చల్లినట్లుంది. వెంకీ, దుబాయ్ శీను అంటూ పక్కా మాస్ కామెడీ సినిమాలతో హిట్లు కొట్టిన రవితేజ-శ్రీను వైట్ల లు ఈసారి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొడతారా లేదా అనేది 16 నవంబర్ వరకు ఆగితే తెలిసిపోతుంది.