శేఖర్ కమ్ముల కొత్త సినిమా లాంచ్ అయ్యింది

ఫిదా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపు 16 నెలల సమయం కావస్తుంది. అయినా, ఇంకా కొత్త సినిమా కబురు లేదే అని శేఖర్ కమ్ముల అభిమానులు కాస్త కంగారుపడిపోతూనే ఉన్నారు. వాళ్ళ ఎదురుచూపులు ముగిసే సమయం ఈరోజే వచ్చింది. శేఖర్ కమ్ముల తన కొత్త సినిమాని లాంచ్ చేశాడు. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటిస్తుండగా, మూవీ డిస్ట్రిబ్యూటర్ గా మాంచి పేరున్న సునీల్ నారంగ్ ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ బ్యానర్ పైన నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాడు తన ప్రొడక్షన్ బ్యానర్ అయిన అమిగోస్ క్రియేషన్స్ పైన.
ఫిదా సినిమా వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే.

శేఖర్ కమ్ముల కొత్త సినిమా లాంచ్ అయ్యింది - Telugu Bullet

ఆ సినిమాతో పరిచయం అయినా సాయి పల్లవి ఇప్పడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇంతటి భారీ విజయం తరువాత శేఖర్ కమ్ముల ఖచ్చితంగా స్టార్ హీరో తో సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు. అలా అనుకున్న అందరికి ఇది కాస్త చేదైన వార్తే. ఎందుకోమరి శేఖర్ కమ్ముల తన గత సినిమాలు హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లతో కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేసినట్టుగానే, ఈసారి కూడా తన కొత్త సినిమాతో అందరూ కొత్త వాళ్లనే పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికైతే వాళ్లెవరో అనేది తెలియలేదు.

శేఖర్ కమ్ముల కొత్త సినిమా లాంచ్ అయ్యింది - Telugu Bullet

శేఖర్ కమ్ముల పరిచయమా చేసిన కొత్తవాళ్ళలో హ్యాపీ డేస్ సినిమా వాళ్లే మంచి పేరు సంపాదించారు కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నటించిన వాళ్ళెవరికీ అంత పేరు రాలేదు సరికదా కాస్తయినా నిలదొక్కుకోలేదు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇదికాకుండా శేఖర్ కమ్ముల హీరోలుగా పరిచయం చేసే కొత్తవాళ్లలో దాదాపు అందరూ రిచ్ కిడ్స్ అయ్యి ఉండడం గమనించదగిన విషయం. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నెల నుండి ప్రారంభం అయ్యి, రాబోవు సమ్మర్ వరకు విడుదల చేయాలనీ భావిస్తున్నారు.