శ్రీరెడ్డికి శేఖ‌ర్ క‌మ్ముల వార్నింగ్

Sekhar Kammula Serious Warning to Sri Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగులో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి వ్య‌వ‌హారంపై ఇప్ప‌టిదాకా ఆమె ఆరోప‌ణ‌లు చేసిన‌వారెవ‌రూ ప్ర‌త్య‌క్షంగా స్పందించ‌లేదు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు, హీరోలు చాలామందిపై ఆమె డైరెక్ట్ గానే ఆరోప‌ణ‌లు చేసిన‌ప్ప‌టికీ… ఆమె వ్యాఖ్య‌ల‌కు ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. ఈ క్ర‌మంలో సోమ‌వారం శ్రీరెడ్డి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఉద్దేశించి సంచ‌ల‌నాత్మ‌క పోస్ట్ చేసింది. తెలుగు అమ్మాయిలు ప‌క్క‌లోకి త‌ప్ప ఇంకెందుకూ ప‌నికిరార‌ని ఓ బ‌క్క‌ప‌లుచ‌ని ద‌ర్శ‌కుడు అనుకుంటాడని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌పై శేఖ‌ర్ క‌మ్ముల వెంట‌నే రియాక్ట్ అయ్యాడు. తీవ్రంగా స్పందిస్తూ ఇవాళ ఫేస్ బుక్ లోఓ పోస్ట్ చేశాడు. త‌నను కించ‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన పోస్ట్ త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, ఆ పోస్ట్ లోని ప్ర‌తి మాటా అబ‌ద్ధం, అస‌భ్య‌క‌రం, అవ‌మాన‌క‌ర‌మ‌ని శేఖ‌ర్ క‌మ్ముల ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. ఆ పోస్ట్ త‌న‌కు, త‌న కుటుంబానికి, త‌న‌ను గౌర‌వించేవారికి చాలా మ‌న‌స్థాపాన్ని క‌లిగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశాడు.

తాను ఎప్పుడూ క‌ల‌వ‌ని, అస‌లు చూడ‌నైనా చూడ‌ని, క‌నీసం ఫోన్ లో కూడా మాట్లాడ‌ని ఓ అమ్మాయి… త‌న గురించి ఆధారం లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం షాకింగ్ గా ఉంద‌ని, ఈ దిగ‌జారుడు చ‌ర్య వెన‌క ఎవ‌రున్నా, వారి ఉద్దేశం ఏదైనా తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఒక్క‌టే అని, ఇది త‌ప్పు, నేరం, అనైతికమ‌ని శేఖ‌ర్ క‌మ్ముల వ్యాఖ్యానించాడు. స్త్రీల స‌మానత్వం, సాధికారిత‌ల‌ను తాను ఎంత‌గా న‌మ్ముతానో త‌న సినిమాలు, కార్య‌క్ర‌మాలను చూస్తే అర్ధ‌మ‌వుతుంద‌ని, త‌న వ్య‌క్తిత్వం, న‌మ్మే విలువ‌లు త‌న ప్రాణం కంటే ముఖ్య‌మని వాటి మీద బుర‌ద జ‌ల్లే ప్రయ‌త్నం చేస్తే వ‌దిలిపెట్టే ప్ర‌సక్తేలేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన అమ్మాయి త‌న పోస్ట్ లోని ప్ర‌తీ మాటా త‌ప్పు అని ఒప్పుకుని, క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ఆమెపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని తన పోస్ట్ లో పేర్కొన్నారు. శేఖ‌ర్ క‌మ్ముల త‌న పోస్ట్ లో ఎక్క‌డా శ్రీరెడ్డి పేరు వాడ‌లేదు. మొత్తానికి శేఖ‌ర్ క‌మ్ముల బాట‌లో శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన‌వారంతా క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ద‌ప‌డితే… ఆమెకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.