మాణిక్యాల రావు గారూ బుర్రుండే మాట్లాడారా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ రాజకీయం యమా రంజుగా మారింది, నిన్న మొన్నటి దాకా పవన్-టీడీపీ-బీజేపి ఒక వైపు జగన్ ఒక్కడు మరో వైపు ఉండడం వల్ల చప్పగా ఉండేది కాని ఇప్పుడు మాత్రం ఒక రేంజ్ లో ఉంది.

టీడీపీ మీద మొత్తం బీజీపీ-వైకాపా-జనసేన కలిసి ముప్పేట దాడి చేస్తుండడంతో అందరికీ ఒక అనుమానం ఉండేది వారు ముగ్గురు ఏకమయి టీడీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని. కాని ఈరోజు మాజీ మంత్రి మాణిక్యాల రావి చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజలకి కూడా వారు ముగ్గురు కలిసారన్న విషయాన్ని తెలియచెప్పేలా ఉన్నాయి.

ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మీడియా ముఖంగా మాణిక్యాల రావు కొన్ని వ్యాఖ్యలు చేసారు ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం “హోదా వద్దన్న వాళ్లు కమ్మోళ్లు… కావాలంటున్నవాళ్లు కాపులు అంటూ ఒక్క ముక్కలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పేశాడు.

మరో లాజిక్ ని మాణిక్యాల రావు మరచిపోయినట్టున్నాడు. అదేమంటే ఆయన అన్న మాటల ప్రకారం హోదా కోరుతున్నవాళ్లు అందరూ కాపులట. మరి చంద్రబాబు అడుగుతున్నదేంటి, టీడీపీ ఆందోళన చేస్తోంది దేని గురించి ? అంటే టీడీపీ కాపు పక్షం అని ఒప్పుకున్నావా ? ఇంకో విషయం హోదా కావాలని, ఒక ఆంధ్రా వాడిగా రాజినామాకి ముందయినా తరువాతయినా నువ్  కేంద్రాన్ని అడిగావా ? పోనీ రోడ్డు ఎక్కి ధర్నా లాంటివి చేశావా ? లేదే అంటే నువ్వు కమ్మ వారిలో ఒకడివా, లేక వాళ్ళతో కుమ్మక్కయ్యావా ?ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు.

మరో మాట కాపుల్లో 80 శాతం మంది పవన్ కల్యాణ్ తోనే ఉన్నారు అంటున్నాడు. పవన్ కల్యాణ్ ఎటూ మన వైపే ఉన్నాడన్న ధైర్యంతో. ఇప్పుడు హోదా ఉద్యమం చేస్తున్నది కాపులే అంటున్నాడు. ఓ పక్కన హోదా కోసం రాష్ట్రం కేంద్రం తో పోరాడుతోంది.ఇలాంటి సమయంలో కమ్మోళ్లు అప్పుడు ప్యాకేజీ కావాలన్నారు. ఇప్పుడు కాపులు హోదా అడుగుతున్నారు అని చెప్పడం చూస్తే ఇలాంటి వాళ్ల అసలు రంగు ఏంటో బైటపడుతోంది.

రాష్ట్రంలో తెలుగుదేశం ని తలదన్నే బలీయమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుందని, వచ్చే ఎన్నికలలో తామే కింగ్ మేకర్లమని చెప్పుకునే బీజేపీ నేతల మాటలకు పవన్ వెనుక 80 శాతం కాపు వోట్లు ఉన్నాయి అని చెప్పుకోవడం చూస్తే వీరి బంధం త్వరలోనే బట్టబయలు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.