శ్రీరెడ్డి తాజా టార్గెట్‌ నేచురల్‌ స్టార్‌..!

Sri Reddy Controversy comments on Natural Star Nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని రోజులుగా సినీ ప్రముఖులపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో ఆడవారిపై లైంగిక వేదింపులు తారా స్థాయికి చేరాయని, కొత్త వారు వస్తే చాలు వారి జీవితాలతో ఆడుకునేందుకు కొందరు దుర్మార్ఘులు ప్రయత్నాలు చేస్తారు అంటూ మొదట చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి తాజాగా ఒక్కో పేరును బయటకు తీసుకు వస్తుంది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు తాజాగా నేచురల్‌ స్టార్‌పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది. శేఖర్‌ కమ్ములపై చేసిన ఆరోపణల గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే మరోస్టార్‌ను శ్రీరెడ్డి టార్గెట్‌ చేయడం చర్చనీయాంశం అవుతుంది.

శ్రీరెడ్డి తాజాగా సోషల్‌ మీడియాలో… నీవు స్క్రీన్‌పై సహజంగా యాక్ట్‌ చేస్తావు, అదే సమయంలో నిజ జీవితంలో కూడా చాలా సహజంగా కనిపిస్తూ, యాక్ట్‌ చేస్తావు. నీవు నేచురల్‌గా కనిపించడం కేవలం ముసుగు మాత్రమే, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ చెబుతుంటావు, అవన్ని కూడా సింపథి కోసమే, జనాల ముందు నువ్వు బాగా డ్రామాలు ప్లే చేస్తావు. నీ కంటే పెద్ద హీరోలు తోటి నటీనటులను గౌరవంగా చూస్తారు. కొత్త దర్శకులు అంటే నీకు చులకన. మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి వారి నుండి నువ్వు చాలా నేర్చుకోవాలి. ఇటీవలే నీకు కొడుకు పుట్టాడు, కంగ్రాట్స్‌. జీవితంలో జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు అన్యాయం గెలవదు. ఇండస్ట్రీలో నీలాంటి వారు ఈకల్లా రాలిపోయే రోజు వస్తుంది అంటూ పోస్ట్‌ చేసింది. ఈ వ్యాఖ్యలు హీరో నాని గురించి అయ్యి ఉంటాయి అని కొందరు అంచనా వేస్తున్నారు. నానిపై శ్రీరెడ్డి ఇంత సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.