అఖిల ప్రియ‌…నంద్యాల జేజ‌మ్మ‌

Fans design photo nandyal Jejamma as bhuma akhila priya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల ఉప ఎన్నిక‌లో టిడీపీ హ‌వా నేప‌థ్యంలో భూమా అఖిల ప్రియ‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణం త‌రువాత చిన్న వ‌య‌సులోనే వారికి వార‌సురాలిగా ఎదుగుతున్న అఖిల ప్రియకు నంద్యాల ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఉప ఎన్నిక లో గెలుపు కోసం టీడీపీ నేత‌లు ఎంతోమంది క‌ష్ట‌ప‌డినా… అంద‌రికన్నా ఎక్కువ‌గా అఖిల ప్రియకే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.

మూడేళ్ల టీడీపీ పాల‌న‌పై రెఫ‌రెండంగా ప్ర‌తిప‌క్షం ప్ర‌చారం చేసిన ఉప ఎన్నిక‌లో అధికార పార్టీని గెలుపు తీరానికి చేర్చ‌టంలో అఖిల ప్రియ కృషి ఎంతో ఉంది. త‌ల్లిదండ్రులు లేని పిల్ల‌ల‌పై పోటీకి నిల‌బెట్టారు అంటూ… ప్ర‌తిప‌క్షంపై .ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌భావ‌మూ నంద్యాల ప్ర‌జ‌ల‌పై క‌నిపించింది. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి మ‌ద్ద‌తుగా అఖిల‌ప్రియ‌ ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలోభూమా దంప‌తుల‌ను త‌ల‌చుక‌న్న స్థానికుల‌కు వైసీపీ పై ఆగ్ర‌హం క‌లిగింది.

త‌ల్లిదండ్రుల ఆశ‌యాల‌ను, టీడీపీ అభివృద్ధి మంత్రాన్ని క‌ల‌బోసి ప్ర‌చారం నిర్వ‌హించి అఖిల‌ప్రియ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోగ‌లిగారు. ఈ నేపథ్యంలో నంద్యాల లో ఆమె ఫొటోతో ఏర్పాటు చేసిన పోస్ట‌రు ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అరుంధ‌తి సినిమాలో అనుష్క వేష‌ధార‌ణ‌లో అఖిల ప్రియ ఫొటోను ముద్రించారు. నంద్యాల జేజ‌మ్మ‌…ఇక్క‌డ ఏ ప‌శుప‌తి ఆట‌లు సాగ‌వు అనే హెచ్చ‌రిక‌నూ పోస్ట‌ర్ పై ముద్రించారు. అఖిల‌ప్రియ‌మ్మ‌…జేజ‌మ్మ అంటూ ఈ ఫొటోను నెటిజ‌న్లు విప‌రీతంగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

2019 టీడీపీ స్టార్ క్యాంపైనర్స్ జగన్,రోజా .

కెసిఆర్ కోరిక తీర్చలేకపోయిన జగన్.

నంద్యాల పోతే 2019 కష్టమే.