చెల్లి బాటలోనే అన్న…గన్ మెన్లను వెనక్కు పంపిన ఎమ్మెల్యే !

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కారడాన్ సెర్చ్ అధికార పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యింది. స్వయంగా రాష్ట్ర మంత్రే తన సెక్యూరిటీని, గన్ మెన్లను వెనక్కు పంపడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనిఖీల పేరుతో టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు వేధిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి అఖిల ప్రియ గన్‌మెన్లను వెనక్కు పంపగా తాజాగా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఆమెకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ తన గన్‌ మెన్లలను బ్రహ్మానంద రెడ్డి వెనక్కు పంపారు. తన చెల్లెలికి లేని భద్రత తనకు కూడా అవసరం లేదని చెబుతూ ఆయన వెనక్కి పంపడం కలకలం రేపుతోంది.జనవరి 3న పోలీసులు ఆళ్లగడ్డలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

చెల్లి బాటలోనే అన్న...గన్ మెన్లను వెనక్కు పంపిన ఎమ్మెల్యే ! - Telugu Bullet

అందరితో పాటే మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ పోలీసులు సోదాలు జరిపారు. ఈ వ్యవహారాన్ని కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమను పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై అఖిల ప్రియ స్థానిక పోలీసుల్ని వివరణ కోరగా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. అనుమానం ఉన్నవారి ఇళ్లలోనే సోదాలు చేశామని అనడంతో తమ కార్యకర్తలను వేధింపులకి గురి చేస్తున్నారనే కోపతో ఆమె గన్‌మెన్‌లను వెనక్కు పంపారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదని తిరస్కరించారు. తనకు రక్షణగా వస్తున్న స్థానిక పోలీసుల్ని కూడా వెంట రావద్దన్నారు. ఎలాంటి భద్రత లేకుండానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామ దర్శిని, జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు చెల్లి బాటలోనే అన్న పయనించడం హాట్ టాపిక్ గా మారింది.