పార్టీ మాతుతున్న అఖిల ప్రియ…క్లారిటీ ఇచ్చేసింది…!

AP Minister Akhila Priya Respond On Party Change Rumours

ఏపీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ పార్టీ మారతారంటూ వ్యాపించిన వదంతులపై ఆమె స్పందించారు. కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని మరీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అన్నారు. చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లొచ్చాయని అన్నారు. నిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న ధరకు ఐదు రెట్లు ఇవ్వాలని, నిర్వాసిత కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని క్లారిటీ ఇచ్చారు.

గన్‌మెన్ల వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని మంత్రి చెప్పారు. తనకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని జనసేనలోకి, వైసీపీలోకి వెళతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా నమ్మొద్దన్నారు. సీఎం కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, తన తల్లిదండ్రులు చూపిన బాటలోనే నడిస్తానని తెలిపారు. జనవరి 3న అర్ధరాత్రి తర్వాత ఆళ్లగడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆ తర్వాత మంత్రి అనుచరుడు ఒకరి మీద బైండోవర్ చేశారు. ఈ వ్యవహారాన్ని కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమను పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల స్థానికులు పోలీసుల్ని వివరణ కోరగా.. ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. అనుమానం ఉన్నవారి ఇళ్లలోనే సోదాలు చేశామన్నారు. దీంతో గన్ మెన్లను వెనక్కు పంపింది అఖిల ప్రియ.