ఏపీ మంత్రి కన్నబాబు ఇంట తీవ్ర విషాదం

tragedy in ap minister kannababu house

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సురేష్‌ గుండెపోటుతో మృతి చెందారు.  సురేష్ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో గురువారం ఉదయం సురేష్ కన్నుమూశారు. మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు. సోదరుడి మృతదేహంతో పాటు కన్నబాబు కాకినాడ వెళ్తున్నారు.కురసాల సురేష్ గతంలో విశాఖపట్నంలో ‘ఈనాడు’ రిపోర్టర్‌గా పని చేశారు. తర్వాత జర్నలిజం వృత్తిని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఈయన కన్నబాబుకి పెద్ద తమ్ముడు. మరో తమ్ముడు కళ్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలకు దర్శకత్వం వహించారు. సురేష్ మృతిపై మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, దొరబాబు, దాడిశెట్టి రాజా, చంటిబాబు తదితరులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్ కూడా ఆయనను ఫోన్ లో పరామర్శించినట్టు సమాచారం.