ఏపీ మంత్రికి తప్పిన పెను ప్రమాదం !

AP minister escaped from an accident

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో కల్వర్టును ఆయన కారు ఢీకొట్టింది. కాల్వ శ్రీనివాసులుతో పాటు జెడ్పీ చైర్మన్ నాగరాజు కూడా ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, ఈ సమాచారం సీఎం చంద్రబాబుకు తెలియడంతో కాల్వ శ్రీనివాసులుకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు.