బాబుగా కనిపించేందుకు బాబు ప్రయత్నాలు

Rana to do chandrababu role

తెలుగు వారి ఆరాద్య నటుడు ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. ఈ చిత్రం షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇటీవలే రామోజీ ఫిల్మ్‌ సిటీలో పూర్తి అయిన విషయం తెల్సిందే. మొదటి షెడ్యూల్‌లో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటించగా, ప్రముఖ దర్శకుడి పాత్రలో సత్యనారాయణ ఇంకా ప్రముఖ నటీనటులు నటించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండవ షెడ్యూల్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. ఆగస్టు రెండవ వారం లేదా మూడవ వారం నుండి అదే రామోజీ ఫిల్మ్‌ సిటీలో రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు క్రిష్‌ ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో వేయిస్తున్న విషయం తెల్సిందే.

చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలుగు వారందరికి చంద్రబాబు నాయుడు అనగానే ఊహలో కనిపించే రూపం పిల్లి గడ్డం, విక్టరీ సింబల్‌. అందుకే రానా ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే గడ్డం పెంచిన రానా షూటింగ్‌ సమయంలో పిల్లి గడ్డం తరహాలో కట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు హావభావాలను మరియు డైలాగ్‌ డెలవరీని తెలుసుకునేందుకు చంద్రబాబు నాయుడు పాత వీడియోలను రానా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 15 రోజుల పాటు ఎన్టీఆర్‌ చిత్రం షూటింగ్‌లో రానా పాల్గొనబోతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో రాజకీయ నాయకుడిగా అలరించిన రానా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాత్రలో మెప్పిస్తాడు అంటూ దర్శకుడు క్రిష్‌ కూడా నమ్మకంతో ఉన్నాడు.