కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్…ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు జంప్

another shock to congress party

కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కర్ణాటకలో తిరుగు బావుటా ఎగరేసిన ఎమ్మెల్యేలు.. ముంబైలో మకాం పెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఈ గండ నుంచి గట్టేక్కేందుకు తంటాలు పడుతుండగానే.. కూడా చేజారిపోతోంది. గోవాలోనూ కాంగ్రెస్‌‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చారు. 10మంది ఓ వర్గంగా ఏర్పడి.. ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవలేఖర్‌ నేతృత్వంలో స్పీకర్‌ను కలిశారు. తమ వర్గానికి చెందిన 10మంది ఎమ్మెల్యేలను బీజేపీ శాసనసభాపక్షంలో విలీనం చేయాలని స్పీకర్‌కు లేఖ సమర్పించారు. బీజేపీ బలం పెరిగినట్లు అటు సీఎం కూడా లేఖ ఇచ్చినట్లు స్పీకర్‌ తెలిపారు. ఈ ఊహించని పరిణామంతో కాంగ్రెస్‌ కంగుతినగా.. ఆ పార్టీకి అసెంబ్లీలో కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. బీజేపీ బలం 27కు చేరింది. ఈ 10మందిని బీజేపీ శాసనసభాపక్షంలో కలుపుతూ స్పీకర్ రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. స్పీకర్‌కు లేఖ సమర్పించిన 10 ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది. హస్తినలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం విజయ్‌ సర్దేశాయ్‌ సహా ఇతర మంత్రులకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు సీఎం ప్రమోద్‌ సావంత్‌. కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చి వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.