శ్రీశైలం గేట్లు ఎత్తివేత…

minister devineni uma open srisailam gates to releasee water

Posted October 12, 2017 at 16:08

మూడేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం ఉదయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఒక్కొ గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 884.80 అడుగులతో 214.8450 టీఎంసీలుగా ఉంది.

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,878 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు.

SHARE