స‌రిగ్గా పెళ్లి స‌మ‌యానికి అందేలా డైమండ్ ఉంగ‌రాలు

trivikram and Pawan surprise wedding gift for Sam and Chay wedding

Posted October 12, 2017 at 15:43 

టాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు నాగ‌చైత‌న్య‌, స‌మంత గోవాలో అక్టోబ‌రు 6న వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు. కుటుంబ స‌భ్యులు, అత్యంత‌ స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. కొత్త దంప‌తుల‌కు వారంతా ఏమేం గిఫ్ట్ లు ఇచ్చారో తెలియ‌దు కానీ…  పెళ్లికి వెళ్ల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, స్టార్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాత్రం చై, సామ్ ల‌కు స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. స‌రిగ్గా వివాహ స‌మ‌యానికి అందేలా వారిద్ద‌రూ డైమండ్ ఉంగ‌రాలు కానుక‌గా పంపించారు. ఈ ఉంగ‌రాల‌ను ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించారు. ఈ గిఫ్ట్ చూసి చైత‌న్య‌, స‌మంత ఉబ్బిత‌బ్బియ్యార‌ని స‌మాచారం. మొద‌ట ఈ ఉంగ‌రాల‌ను హైద‌రాబాద్ లో జ‌రిగే రిసెప్ష‌న్ లో ఇవ్వాల‌ని భావించార‌ని, అయితే పెళ్లిరోజున ఇస్తే మ‌రింత ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని, కానుక‌ల‌ను గోవాకు పంపించిన‌ట్టు తెలుస్తోంది.. అయితే ఇందులో ఏ మాత్రం నిజంలేద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ అస‌లు చై, సామ్ కు ఎలాంటి గిఫ్ట్ లూ పంప‌లేద‌ని వారు వాదిస్తున్నారు. మ‌రి ఇందులో నిజానిజాలేమిటో కొత్త దంప‌తులు చెబితేనే కాని తెలియ‌దు.

SHARE