మంత్రి నారాయణ దగ్గరి బంధువుతో అఖిల నిశ్చితార్థం : త్వరలో పెళ్లి !

Bhuma Akhila Priya Engagement ceremony

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లపీటలు ఎక్కబోతున్నారు. భార్గవ్‌ అనే వ్యక్తితో మంత్రి అఖిలప్రియకు నిశ్చితార్ధం జరిగింది. అయితే ఇది ఇద్దరికీ రెండవ వివాహమే అని తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది కడప మాజీ మేయర్ రవీంద్ర రెడ్డి కొడుకుతో అఖిల ప్రియకు పెళ్లి జరిగింది. అయితే ఒక పాప పుట్టిన తర్వాత వారి మధ్య విభేదాలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. అదే విధంగా మాజీ దీజీపీ నండూరి సాంబశివ రావు చిన్న కూతుర్ని వివాహం చేసుకున్న మంత్రి నారాయణ అల్లుడు పునీత్ తమ్ముడు భార్గవ్ ఆమెకి విడాకులు ఇచ్చారు. అయితే విడాకుల తర్వాత మంత్రి అఖిల ప్రియతో ప్రేమలో పడిన భార్గవ్ ఇప్పుడు మంత్రి అఖిల ప్రియను కులాంతర వివాహం చేసుకుంటున్నారు. గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల లోని సినీ-రాజకీయ కుటుంబాల వారు కులాంతర వివాహలకే పెద్ద పీటలు వేస్తున్నారు.

akhil ptiya engeg ment

అటు మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఇక రాజకీయాల్లో కూడా అడపాదడపా కులాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వారి కోవలోనే భార్గవ్-అఖిల ప్రియలు నిలవనున్నారు. హైదరాబాద్‌లోని మంత్రి అఖిల ప్రియ నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో అఖిలప్రియ, భార్గవ్‌ల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారని తెలుస్తోంధీ. గతకొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్‌లు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు జరిపించగా.. ఆగస్టు 29న అఖిలప్రియ, భార్గవ్‌ల వివాహం జరుగనున్నట్టు సమాచారం. ఈ నిశ్చితార్థ వేడుక గురించి మంత్రి అఖిలప్రియ కుటుంబం కానీ, భార్గవ్ కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు.

akhila priya