అలకబూనిన అఖిల ప్రియ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓపక్క అన్నివిధాలా ఆదుకుంటామన్న కేంద్రం ఆదుకోకుండా, ఆడుకుంటుంటే ఎలా అయినా ఆంధ్రా కి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయినా నిధులు రాబట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ఆయన మంత్రివర్గం లోని వారే ఆయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న అయ్యన్న-గంటా ల మధ్య ఉన్న విభేదాలు బయటకి వస్తే ఇప్పుడు మంత్రి అఖిల ప్రియ పార్టీనేత ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి…

వారిద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి… ఏకంగా ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, సమస్యలన్నీ నాకే చెప్పుకోండి అంటూ సుబ్బారెడ్డి ప్రచారం చేస్తుండడం, తన పోరాటం అఖిలప్రియ మీదే అంటూ ఏవీ పబ్లిగ్గానే ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని చెబుతుండడం అఖిలప్రియకు మింగుడు పడడంలేదు. పరిస్థితి ఇంతదాకా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకి ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో మరో నాయకుడి పెత్తనం గురించి పట్టించుకోకపోవడంతో కలత చెందినట్టు భావిస్తున్నారు. అందుకే ఆమె అలకబూనినట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి వైఖరితో అలక పాన్పు ఎక్కిన అఖిలప్రియ పార్టీ-ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

అయితే ఏవీ వెర్షన్ మరోలా ఉంది తనను పిలవకుండా భూమా నాగిరెడ్డి వర్ధంతి సభ జరపడంపై ఏపీ సుబ్బారెడ్డి కూడా మండిపడుతున్నారు. భూమా కుటుంబానికి అత్యంత శ్రేయోభిలాషినైన తనను పలవకుంటే ఆయన ఆత్మకు శాంతించి ఉండదని, తన కుమార్తెతోపాటు పెరిగిన అఖిలప్రియ.. తనను గుంటనక్క అని సంబోధించడం బాధాకరమన్నారు. ఒకవేళ భూమా నాగిరెడ్డే బతికి ఉంటే.. ఈ మాట అన్నందుకు అఖిల చెంపలు పగులగొట్టే వారు.. అని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.

భూమా నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో తనది కీలక పాత్ర అని, నాగిరెడ్డి హీరో అయితే, తాను డైరెక్టర్ అని, తెరపై హీరో మాత్రమే కనిపిస్తాడు కాబట్టి.. భూమా కనిపించారని, డైరెక్టర్ లా తను తెరమరుగునే ఉండి మొత్తం కథను నడిపించాను అని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ముప్పై ఐదేళ్ళుగా నాగిరెడ్డితో తనకున్న స్నేహాన్ని.. అఖిలప్రియ మూడు నిమిషాల్లోనే తెంచేసిందన్నారు. తన తండ్రి చనిపోతేనే ఏడవలేదన్న అఖిలప్రియను తానెలా ఏడిపించగలనంటూ అఖిల ప్రియ గురించి వ్యాఖ్యానించారు. ఏవీ హెల్ప్ లైన్ ప్రారంభోత్సవంతో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విబేధాలు మరో సారి వార్తలకి ఎక్కాయి.