విశాఖలో ఈ వీసా కి కేంద్రం గ్రీన్ సిగ్నల్…

Bhuma Akhila Priya comments on Vizag Airport E-Visa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ లో టూరిజం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఒక్కోటిగా అమల్లోకి వస్తున్నాయి. తాజాగా విశాఖలో ఈ వీసా జారీకి అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్ర సర్కార్ కి కృతజ్ఞతలు చెప్పిన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పిన మరికొన్ని విషయాలు ఇవే.

– విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఈ-వీసాకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్
– రేప‌టి నుంచి విశాఖ‌లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవ‌ల్ ప్రారంభం – టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ‌
– ఆన్ లైన్ విసాతో విదేశీ ప‌ర్యాట‌కులు ఇక నేరుగా విశాఖ చేరుకోవ‌చ్చు- టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ‌
– ఈ-టూరిస్ట్ వీసాతో ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్యాట‌కానికి కొత్త ఊపు
– దేశంలోని 16 ఎయిర్ పోర్ట్ ల‌కు మాత్ర‌మే ఈ=వీసా స‌దుపాయం ఉంది
– సీఎం చంద్ర‌బాబు కృషితోనే విశాఖ ఎయిర్ పోర్ట్ కు ఈ -వీసా స‌దుపాయం
– ఈ-వీసా కోసం కేంద్ర హోంశాఖ‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రుల‌తో సీఎం 3 సార్లు మాట్లాడారు
– ఇపుడు ఈ=వీసా రాక‌తో ఏపీలో విదేశీ టూరిస్టులు, పెట్టుబ‌డులు పెరుగుతాయి.
– 147 దేశాల నుంచి విదేశీ ప‌ర్యాట‌కులు నేరుగా విశాఖ రావ‌చ్చు.
– టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవ‌ల్ స‌దుపాయం క‌ల్పించిన కేంద్రానికి కృత‌జ్ణ్న‌త‌లు -: ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ‌