నరసింహారెడ్డి పొగరు చూపుతున్న లీక్‌ డైలాగ్‌

megha-star-chiranjeevi-151-movie-dialogue-leaked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ దాదాపు ఆరు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. టైటిల్‌ ఆ విష్కరించడంతో పాటు మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌ తమ కలం సాయంను అందించబోతున్నారు. గతంలో చిరంజీవితో అద్బుతమైన డైలాగ్స్‌ను పలికించిన ఈ పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమాలో కూడా చిరు కోసం పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ను రాయడం జరిగింది. 

ఈ చిత్రంలో చిరంజీవి ఎన్నో అద్బుతమైన పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పబోతున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా చిరు చెప్పబోతున్న పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌లోంచి ఒక డైలాగ్‌ లీక్‌ అయ్యింది. చిత్ర యూనిట్‌ సభ్యులు కావాలని లీక్‌ చేశారో లేక కాకతాళీయంగా లీక్‌ అయ్యిందో కాని ఇప్పుడు ఆ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఆ డైలాగ్‌ ఏంటి అంటే… ఒరేయ్‌ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు బుజంపై తుపాకితో వచ్చావ్‌… అయినా నా చేయి మీసంపై పడగానే నీ బట్టలు తడిసిపోతున్నాయి అంటూ సాగే డైలాగ్‌ అందరిని ఆకర్షిస్తుంది. అద్బుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సురేందర్‌ రెడ్డి చెబుతున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలిపి కథను సిద్దం చేయడం జరిగింది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. చిరుకు జోడీగా నయనతార నటించనుండగా, అమితాబ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, కిచ్చ సుదీప్‌లు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి గట్టిగా కొట్టాడు

పవన్‌25 గురించి ఒక పుకారు.. నిజమైతే ఫ్యాన్స్‌కు షాక్‌

అల్లరోడు ఈసారి కూడా కష్టమేనా?

నరసింహారెడ్డి పొగరు చూపుతున్న లీక్‌ డైలాగ్‌ - Telugu Bullet