గిరిజ‌, స‌మంత లాంటి హీరోయిన్ కావాలి

Nagarjuna says Kalyani Priyadarshini gets name like as samantha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 యువ హీరో అఖిల్ రెండో సినిమా హ‌లో… తొలి సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ మ‌నం సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో  చిత్రంలో నటిస్తున్నారు. సినిమా టైటిల్ ఖ‌రారు చేసిన త‌రువాత సోష‌ల్ మీడియాలో వినూత్న‌రీతిలో ప్ర‌చారం నిర్వ‌హించారు.  టైటిల్ కు పాజిటివ్ టాక్ రావ‌టంతో త్వ‌ర‌లో టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని డైరెక్ట‌ర్ భావిస్తున్నారు.

రేపు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హ‌లో చిత్రం గురించి కొన్ని సంగ‌తులు చెప్పాడు అక్కినేని నాగార్జున‌. అఖిల్ రెండో సినిమాకు క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటుంద‌నే హ‌లో అనే టైటిల్ పెట్టామ‌ని తెలిపారు. సినిమాలో హీరో త‌న ప్రియురాలి చేత త‌ర‌చూ హ‌లో అనిపించుకోటానికి ప్ర‌య‌త్నిస్తాడ‌ని, అందుకే హ‌లో అని పెట్టామ‌ని నాగ్ చెప్పారు. అఖిల్ మొద‌టిచిత్రానికి, రెండోచిత్రానికి మ‌ధ్య గ్యాప్ రావ‌టానికి కార‌ణం హీరోయిన్ ఎంపిక‌లో ఆల‌స్యం కావ‌ట‌మేన‌న్నారు.

గీతాంజ‌లిలో గిరిజ లా, ఏం మాయ చేశావెలో స‌మంత‌లా హీరోయిన్ కొత్త‌గా క‌నిపించాల‌న్న ఉద్దేశంతోనే చాలా మందిని ప‌రిశీలించామ‌న్నారు. చివ‌ర‌కు డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు  క‌ళ్యాణిని ఎంపిక‌చేశామ‌ని తెలిపారు. హ‌లో సినిమా యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతుంద‌న్నారు. అఖిల్ మొద‌టి సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో రెండో్ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు నాగార్జున‌.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి గట్టిగా కొట్టాడు

పవన్‌25 గురించి ఒక పుకారు.. నిజమైతే ఫ్యాన్స్‌కు షాక్‌

అల్లరోడు ఈసారి కూడా కష్టమేనా?