“హలో” సినిమాతో నాగ్ కి ఇంకో తలనొప్పి.

Nagarjuna gets Legal Notice Over Hello Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొడుకు అఖిల్ కెరీర్ ని గాడిలో పెడుతుందన్న భావనతో “హలో “ సినిమా మీద అక్కినేని నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ ఆ ఆశలు సఫలం అయ్యేట్టు చూడలేకపోయారు. దీంతో హలో మూవీ కి ముందు అఖిల్ ని రీ లాంచ్ చేస్తున్నామని చెప్పిన నాగ్ ఆ సినిమా తరువాత కూడా అదే మాట చెప్పాల్సి వచ్చింది. హలో ఇచ్చిన రిజల్ట్ తో మళ్ళీ అఖిల్ కెరీర్ ని గాడిలో పెట్టాల్సిన పని నాగ్ మీద పడింది. హలో చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు నాగ్ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనుకోకుండా హలో నాగ్ కి కొత్త్త సమస్య తెచ్చిపెట్టింది.

హలో సినిమాలో హీరోయిన్ ఫోన్ కోసం ఓ నెంబర్ వాడారు. కధంతా ఆ నెంబర్ చుట్టూ తిరగడంతో సినిమా చూసిన వారికి ఆ నెంబర్ బాగా రిజిస్టర్ అయ్యింది. నిజానికి ఆ నెంబర్ గురుగ్రామ్ లో నివసించే వికాస్ ప్రజాపతిది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ నెంబర్ హీరోయిన్ ది అనుకుని రోజుకు కొన్ని వందలమంది ఫోన్ చేయడంతో వికాస్ కి చుక్కలు కనబడ్డాయి. అందరికీ ఇది హలో హీరొయిన్ ఫోన్ నెంబర్ కాదని చెప్పి చెప్పి ఆయన విసిగిపోయారు. తనకు ఇంత ఇబ్బంది కలిగించిన హలో సినిమా యూనిట్ మీద యుద్ధానికి తయారు అయిపోయాడు వికాస్. ఇప్పటికే తనకు కలిగిన ఇబ్బందికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లించమంటూ చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసు పంపినట్టు వికాస్ చెప్పారు. అసలే హలో పరాజయ భారాన్ని మోస్తున్న నాగ్ కి ఈ లీగల్ నోటీసు ఇంకో తలనొప్పి కాదంటారా ?