అక్కినేని ఫ్యాన్స్‌ భయపడట్లే అయ్యింది

public Average talk on Akhil hello movie over Nani mca movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి చిత్రం ‘అఖిల్‌’ తీవ్రంగా నిరాశ పర్చింది. అయినా కూడా అఖిల్‌ భవిష్యత్తులో ఒక మంచి స్టార్‌ అవుతాడని అంతా భావించారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌ అఖిల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెట్టుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్‌కు ‘హలో’ చిత్రం పూర్తి సంతృప్తిని ఇస్తుందని సినీ వర్గాల వారు కూడా విశ్లేషించారు. హలో విడుదలకు ముందు నాని చిత్రం ‘ఎంసీఏ’ ఒక్క రోజు ముందు విడుదల అవుతున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడ్డారు. అనుకున్నట్లుగానే ఎంసీఏ వల్ల హలో చిత్రంకు సమస్య మొదలైంది.

‘హలో’ చిత్రం యావరేజ్‌ అంటూ టాక్‌ వచ్చింది. అయినా కూడా ‘ఎంసీఏ’ చిత్రం కారణంగా కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో రావడం లేదు. మొదటి రోజు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా రెండవ రోజు నుండి కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. మొదటి సినిమాతో తీవ్రంగా నిరాశపర్చిన అఖిల్‌ రెండవ సినిమాతో కూడా ఫ్యాన్స్‌ను సంతృప్తి పర్చలేక పోయాడు. హలోకు ఎంసీఏ పోటీ లేకపోతే మంచి కలెక్షన్స్‌ వచ్చేవి అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అందుకే సినిమా విడుదల ముందు కూడా దిల్‌రాజును ఎంసీఏ వాయిదా వేయాల్సిందిగా నాగార్జున కోరినట్లుగా వార్తలు వచ్చాయి. దిల్‌రాజు కోరినట్లుగా ఎంసీఏ చిత్రం వాయిదా పడ్డట్లయితే హలోకు అంతో ఇంతో కలిసి వచ్చేది.