ఆశ్చర్యపర్చుతున్న నాని మూవీ కలెక్షన్స్‌

nani mca movie box office collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని, సాయి పల్లవి జంటగా వచ్చిన మిడిల్‌ క్లాస్‌ అబ్బాయికి రివ్యూవర్స్‌ నుండి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రేక్షకులు మాత్రం పర్వాలేదు అన్నారు. మొత్తంగా ఒక యావరేజ్‌ చిత్రం అంటూ టాక్‌ వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చిన చిత్రాలకు కొన్ని సార్లు దారుణంగా ఉంటాయి, కొన్ని సార్లు ఉన్నతంగా ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మిశ్రమ స్పందన వచ్చినా కూడా మంచి కలెక్షన్స్‌ను సాధిస్తాయి. ఈ ఎంసీఏ చిత్రం కూడా మంచి కలెక్షన్స్‌తో అందరిని ఆశ్చర్యపర్చుతుంది. నాని, సాయి పల్లవిల కాంబో అనగానే అంచనాలు భారీగా పెరిగాయి, ఇక దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా కనుక తప్పకుండా బాగుంటుందని ఆశించారు. దాంతో మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి.

సినిమా యావరేజ్‌గా ఉందని టాక్‌ వచ్చినా కూడా మొదటి రెండు రోజులు కూడా భారీ వసూళ్లను సాధించింది. నాని కెరీర్‌లో మొదటి రెండు రోజుల్లో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా ‘ఎంసీఏ’ నిలిచింది. వారాంతం అయిన నేడు, రేపు కూడా తప్పకుండా ఎంసీఏ భారీగా వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్‌ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన హలో ఫలితం కూడా అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో నాని కలెక్షన్స్‌కు ఎలాంటి ఆందోళన లేదని, సంక్రాంతి సీజన్‌ చిత్రాలు వచ్చే వరకు నాని చిత్రం ఆడే ఛాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.