నేను మీ కళ్యాణ్‌ అంటున్న తేజూ

Sai Dharam Tej in Nenu Mee Kalyan Web Series

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు వెబ్‌ సిరీస్‌లు మరియు షార్ట్‌ ఫిల్మ్‌ల వెంట పడుతున్నారు. రానాతో పాటు ఇంకా ఎంతో మంది సినిమా తారాలు షార్ట్‌ ఫిల్మ్‌లు మరియు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. వారి దారిలోనే మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా నడిచేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ మెగా హీరో ప్రస్తుతం హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. మూడు నాలుగు సినిమాలు చేతిలో ఉన్నా కూడా సన్నిహితుడి కోరిక మేరకు ఒక వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ వెబ్‌ సిరీస్‌ మరి కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఆ వెబ్‌ సిరీస్‌కు ‘నేను మీ కళ్యాణ్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాయి ధరమ్‌ తేజ్‌ తన నిజ జీవిత పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే వెబ్‌ సిరీస్‌లో తేజూ ఒక హీరోగా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర పేరు కళ్యాణ్‌ అయ్యి ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరో వైపు వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తేజూ చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా కరుణాకర్‌ దర్శకత్వంలో చిత్రాన్ని ఇటీవలే మొదలు పెట్టాడు. ఈ రెండు చిత్రాలతో పాటు మరి కొన్ని చిత్రాలు చర్చ దశలో ఉన్నాయి. ఇలా బిజీ బిజీగా ఉన్న తేజూ సరదాగా, స్నేహితుడి కోసం వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌లో స్నేహం మరియు ప్రేమల గురించి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

 నేను మీ కళ్యాణ్‌ అంటున్న తేజూ - Telugu Bullet