సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

Sai Dharam Tej movie is not available now..?
Sai Dharam Tej movie is not available now..?

సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ లాస్ట్ సినిమా విరూపాక్ష బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తరువాత ఆయ‌న సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో ఒక మూవీ చేయాల్సి ఉన్నది . కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇప్పుడు అది వాయిదా ప‌డింది. ఇక రీసెంట్ గా కొత్త ద‌ర్శ‌కుడు రోహిత్ డైరెక్ష‌న్ లో SDT18 సినిమా ని అనౌన్స్ చేశాడు తేజు.

కాగా, ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఒక పీరియాడిక్ క‌థ‌తో తెర‌కెక్కుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ను తేజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ‌డ్జెట్ సినిమా గా తెర‌కెక్కిస్తున్నారు. కాగా, ఈ మూవీ రిలీజ్ పై నిర్మాత‌ల్లో ఒక‌రైన చ‌త‌న్య రెడ్డి తాజాగా ఒక క్లూ ఇచ్చారు. ఈ మూవీ ను వ‌చ్చే ఏడాది ఆగస్టు త‌రువాత రిలీజ్ చేస్తామ‌ని ఆమె తెలిపారు.

Sai Dharam Tej movie is not available now..?
Sai Dharam Tej movie is not available now..?

ఈ మూవీ కు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బ‌డ్జెట్ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ను ప‌ర్ఫెక్ట్ గా తీర్చిదిద్దేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఈ మూవీ లో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్ గా న‌టిస్తోంది.