అఖిల్‌ మళ్లీ యాక్టింగ్‌ స్కూల్‌కు…!

Akhil Akkineni Going to Acting School
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి రెండు సినిమాలతో ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కించుకోలేక పోయాడు. అఖిల్‌ మొదటి చిత్రం అన్ని విషయాల్లో విఫలం కాగా రెండవ చిత్రం ‘హలో’ మాత్రం మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. ఇక అఖిల్‌ డాన్స్‌ విషయంలో  మరియు యాక్షన్‌ సీన్స్‌ విషయంలో పర్వాలేదు. కాని ఎమోషన్‌ విషయంలో, కామెడీ సీన్స్‌ విషయంలో మాత్రం అంతగా నటించలేక పోతున్నాడు. ‘హలో’లో ఆ విషయం క్లీయర్‌గా అర్థం అయ్యింది. మొహంలో అన్ని సార్లు కూడా ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌ కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సినీ వర్గాల వారు కూడా అఖిల్‌ నటనలో ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పడంతో ప్రస్తుతం అఖిల్‌ ఆ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అఖిల్‌ గతంలో రెండు సంవత్సరాల పాటు విదేశాల్లో యాక్టింగ్‌ నేర్చుకున్నాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా చేశాడు. అయినా కూడా అఖిల్‌ నటనలో స్కిల్స్‌ మెరుగుపడలేదు. దాంతో మళ్లీ అఖిల్‌ను యాక్టింగ్‌ స్కూల్‌లో నాగార్జున జాయిన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. రెండు నెలల పాటు ఫేషియల్‌ ఎక్స్‌ఫ్రెషన్స్‌ విషయమై అఖిల్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నాడు. 

ప్రముఖ యాక్టింగ్స్‌ స్కూల్‌లో అఖిల్‌ ట్రైనింగ్‌ అవ్వబోతున్నాడు. మరో వైపు అఖిల్‌ కథలు కూడా వింటూనే ఉన్నాడు. ఈనెల 10 తర్వాత అఖిల్‌ మూడవ సినిమాపై క్లారిటీ రాబోతుంది. మొదటి రెండు సినిమాలను కాస్త ఎక్కువ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అఖిల్‌ మూడవ సినిమాను మాత్రం 20 కోట్ల లోపు బడ్జెట్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు అఖిల్‌ మూడవ చిత్ర దర్శకుడు ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. అఖిల్‌ తన మూడవ చిత్రంలో అయినా పర్‌ ఫెక్ట్‌గా నటిస్తాడేమో చూడాలి.