ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారూ కాపాడండి… సాయ‌మ‌డిగిన పూన‌మ్ కౌర్

poonam kaur asked Pawankalyans help in twitter
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అనుబంధం ఉన్న‌ట్టుగా కత్తి మ‌హేశ్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై న‌టి పూన‌మ్ కౌర్ స్పందించారు. ఈ వివాదం నుంచి త‌న‌ను బ‌య‌ట‌ప‌డేల్సాందిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే ఆమె విజ్ఞ‌ప్తిచేశారు. ఈ మ‌ధ్యాహ్నం దీనిపై వ‌రుస ట్వీట్లు చేశారు. కానీ నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఆ ట్వీట్లు తొల‌గించారు. అయితే అప్ప‌టికే స్క్రీన్ షాట్స్ గా మారిన ఆ ట్వీట్లు వైర‌ల్ గా మారాయి. ప‌వ‌న్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారూ అని సంబోధించిన పూన‌మ్… ఆయ‌న్ను స్వ‌యంగా క‌లిసి దీనిపై మాట్లాడాల‌నుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారూ…ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిలో నాకు స‌హాయం చేయాల్సిందిగా మిమ్మ‌ల్ని అర్దిస్తున్నాను. ఎందుకంటే ఇది నా కెరీర్ కు, కుటుంబానికి, మ‌రీ ముఖ్యంగా నా ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన స‌మ‌స్య‌.

 poonam kaur

ర‌హ‌స్య అజెండాతో ప‌నిచేస్తున్న కొంద‌రికి నేను పొలిట‌ల‌క్ టార్గెట్ కాద‌ల్చుకోలేదు, ఇదే విష‌య‌మై మిమ్మ‌ల్ని స్వ‌యంగా క‌లిసి మాట్లాడాల‌నుకుంటున్నాన‌ని పూనమ్ ట్వీట్ చేశారు. అటు త‌న సోద‌రిని అవ‌మానించిన క‌త్తిమహేశ్ పై ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని పూన‌మ్ కౌర్ సోద‌రుడు శ్యాంసింగ్ చెప్పారు. క‌త్తి చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌న్నారు. పూన‌మ్ కు ఏ ద‌ర్శ‌కుడితోనూ విభేదాలు లేవ‌ని స్ప‌ష్టంచేశారు. నీట్ లో చదివిన పూన‌మ్ కు చేనేత‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని తెలిపారు. కత్తి మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై కొంద‌రి నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

poonam kaur seeks pawans help tweets deleted after minites

డైరెక్ట్ గా పేరు చెప్ప‌కుండా క‌త్తి మ‌హేశ్ ను ఉద్దేశించి ప‌రోక్ష కామెంట్ చేశారు బ‌న్నీ వాసు. ఏ విధ‌మైన సంబంధ‌మూ లేని యువ‌తికి, ఓ యువ‌కుడు సాయ‌ప‌డ్డాడంటే, వారిద్ద‌రి మ‌ధ్యా ఏదో త‌ప్పుడు బంధం ఉంద‌ని అర్ధం చేసుకుంటే ఎలా..? కాస్త ఎద‌గ‌రా బాబూ.. అని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు త‌న యుద్ధం ఆగాలంటే ప‌వ‌న్ నేరుగా దిగిరావ‌డం త‌ప్ప మరో మార్గం లేద‌ని క‌త్తి మ‌హేష్ స్ప‌ష్టంచేశారు. త‌న కోపం అంతా ప‌వ‌న్ అభిమానుల ఉన్మాద చ‌ర్య‌ల‌పైనేన‌ని తెలిపారు. వివాదానికి ప‌రిష్కారం ప‌వ‌న్ చేతుల్లోనే ఉంద‌ని, ఆయ‌న దిగివ‌చ్చి త‌న అభిమానుల‌ను నియంత్రించుకోక త‌ప్ప‌ద‌ని, త‌న‌కు ఫోన్ రాకుండా ఉన్న‌ప్పుడే త‌న పోరాటానికి ముగింప‌ని చెప్పారు.

poonam-kaur-tweets-on-pawan