ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌న్నా విజ‌య్ దేవ‌ర‌కొండ బెట‌ర్

ram gopal varma says vijay devarakonda better than Pawan kalyan

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రిలీజ్ కు ముందే అర్జున్ రెడ్డికి మ‌ద్ద‌తుగా  కామెంట్లు చేస్తూ వ‌చ్చిన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ… విడుదల త‌ర్వాత ఇక ఆ చిత్రాన్ని వీలుకుదిరిన‌ప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. రివ్యూలు కూడా ఈ సినిమాను శివ‌తో పోలిస్తుండ‌టంతో వ‌ర్మ‌కు మ‌రింత సంతోషంగా ఉంది. తాజాగా ఆయ‌న ఓ అడుగుమందుకేసి అర్జున్ రెడ్డి సినిమా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పోలుస్తూ ఓ వివాదాస్ప‌ద కామెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌న్నా… విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌దిరెట్లు బెట‌ర‌ని కామెంట్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా ఓ అద్భుత‌మ‌ని పొగిడాడు. లో బ‌డ్జెట్ తో  తీసిన ఈ సినిమాలో ఎలాంటి పంచ్ డైలాగులూ లేకుండానే డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి అద్భుతంగా తీశాడ‌ని మెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియ‌న్లు కూడా ప‌నిచేయ‌లేద‌ని అన్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ నేచుర‌ల్ గా న‌టించన తీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

లిప్‌లాక్ పోస్ట‌ర్ల‌తో విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నం సృష్టించిన అర్జున్‌రెడ్డికి మ‌ద్ద‌తుగా రాం గోపాల్ వ‌ర్మ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంతురావుతో ఘ‌ర్ష‌ణ‌కు కూడా దిగాడు. హైద‌రాబాద్ లో సిటీ బ‌స్ పై అంటించిన పోస్ట‌ర్ అస‌భ్యంగా ఉందంటూ వీహెచ్ చించివేశారు. దీనిపై ట్విట్ట‌ర్ లో రాంగోపాల్ వ‌ర్మ మండిప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని రో్జులు మాట‌ల యుద్ధం కూడా జ‌రిగింది. ఇక రిలీజ్ రోజే సినిమా చూసిన వ‌ర్మ మ‌రుక్ష‌ణ‌మే అర్జున్ రెడ్డిని పొగుడుతూ కామెంట్లు పోస్ట్ చేశాడు.

భారీ తారాగ‌ణం, హై బ‌డ్జెట్, టాప్ టెక్నీషియ‌న్లు వంటి హంగు ఆర్భాటాలు లేకుండా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌ల‌నం అయింది. యూత్ ను విప‌రీతంగా ఆక‌ర్షించ‌టమే కాకుండా…విమ‌ర్శ‌కులు నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఓ సాధార‌ణ క‌థ‌ను డైరెక్ట‌ర్ వైవిధ్యంగా తెర‌కెక్కించిన తీరు ఈ సినిమాను ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలుపుతోంది. అప్ప‌ట్లో వ‌ర్మ మూవీ శివ కూడా ఇలాగే టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయి తెలుగు సినిమా గ‌తిని మార్చివేసింది. అర్జున్‌రెడ్డి త‌ర్వాతా ఇప్పుడు తెలుగు సినిమాలో అలాంటి మార్పులే రాబోతున్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా.

మరిన్ని వార్తలు:

ఆ వార్తపై రానా క్లారిటీ

గిరిజ‌, స‌మంత లాంటి హీరోయిన్ కావాలి

పవన్‌కు యాక్టింగ్‌ రాదు.. కత్తి మహేష్‌ తర్వాత ఇప్పుడు వర్మ