ఆ పార్టీ దెబ్బకి జగన్ అంబులపొది ఖాళీ.

BJP modi and amit shah use and through to Ys jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో నీటిని ఒలకబోసినాక వాన కురవకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అలాగే వుంది. చంద్రబాబు మీద కసితో బీజేపీ తన అవసరం కోసం కన్ను గీటగానే ముందు వెనుక ఆలోచించకుండా ఆ పార్టీ బుట్టలో పడ్డాడు జగన్. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మిత్రపక్షం టీడీపీ ని మించి స్వామిభక్తి కురిపించాడు జగన్. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం nda మిత్రపక్షాల కన్నా ముందే బీజేపీ అభ్యర్ధికి జగన్ మద్దతు ప్రకటించడం అందరూ చూసారు. ఇక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తప్ప ఇంకో పార్టీ పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదనే స్థాయిలో మాట్లాడారు జగన్. మోడీ అపాయింట్ మెంట్ దొరగ్గానే ఎన్నికల్లో గెలిచినంత హడావిడి చేశారు. తన అవసరాల కోసం బీజేపీ విసిరిన వలలో పడిన జగన్ ఈ వ్యవహారశైలి వల్ల ఎంతో నష్టపోయారు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన అంబులపొదిలో 2019 కి ప్రధాన అస్త్రాలు ఖాళీ అయిపోయాయి.

జగన్ అతి ఉత్సాహం వల్ల 2019 ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా ఉండాల్సిన ప్రత్యేక హోదా అంశం మరుగున పడిపోయింది. సారీ… జగన్ స్వయంగా అంశాన్ని మరుగుపరిచారు. ఇక మోడీ, ఆయన మిత్రపక్షాల మీద పోరాటంలో ప్రధాన అస్త్రం మైనారిటీ ఓటు బ్యాంకు. కానీ బీజేపీ తో పొత్తుకు తహతహలాడి ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు జగన్. అందుకు మైనారిటీ ఓట్లు ఎక్కువగా వున్న నంద్యాల ఫలితమే పెద్ద ఉదాహరణ. ఇలా రెండు ప్రధాన అస్త్రాలు ఖాళీ అయ్యాక ఇప్పుడు 2019 కోసం జగన్ ఆయుధాల కోసం అటు ఇటు చూస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

సహనంతో మోడీని గెలిచిన బాబు.

గోస్పాడులో పీకేనే ముంచాడా

రోజాకు పోటీగా వాణి