గోస్పాడులో పీకేనే ముంచాడా

prashant-kishor-says-gospadu-concluded-that-there-is-a-huge-majority

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇప్పటివరకూ ఏపీలో ఒకే పీకే ఉండేవాడు. కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చాక పీకే అంటే పవన్ కల్యాణ్ అనేది వెనక్కుపోయి.. ప్రశాంత్ కిషోర్ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. తెరవెనుక ఉండాల్సిన సలహాదారును ప్లీనరీలో పరిచయం చేసిన జగన్ అతిపెద్ద తప్పు చేశారని నంద్యాల జనం తీర్పిచ్చారు.

వచ్చిన దగ్గర్నుంచి సర్వేల పేరుతో వైసీపీ నేతల్ని హడావిడి చేసిన పీకే.. నంద్యాల ఫలితం మీద సర్వే చేశారు. నంద్యాల అర్బన్, రూరల్ పోటాపోటీగా ఉన్నా.. గోస్పాడు మాత్రం భారీ మెజార్టీ వస్తుందని తేల్చిచెప్పారు. దీంతో గుడ్డిగా నమ్మిన జగన్ నట్టేట్లో మునిగారు.

అసలు పీకే మన రాష్ట్రానికే కొత్త. ఆయన ఎక్కడ్నుంచో వచ్చి అడిగేస్తే జనం నిజం చెప్పేస్తారా.. పైగా మన దగ్గర జనాలు రాజకీయం చైతన్యవంతులు. ఉత్తరాది వారిలా అడిగిన వారందరికీ నిజాలు చెప్పరు. ఆ సంగతి తెలియకుండా సర్వేను క్రాస్ చెక్ చేసుకోకుండా జగన్ చెవ్విలో పువ్వు పెట్టేశాడు పీకే. ఇప్పటికైనా పీకేని వదలించుకోవాలని జగన్ కు నేలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఇంకా కోలుకోని కాంగ్రెస్

వైసీపీకి ముందే గొయ్యి తవ్విన కన్నబాబు.

కాకినాడలో కింగ్ ఎవరు..?