రోజాకు పోటీగా వాణి

tdp-going-to-involve-vani-viswanath-against-roja

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు నంద్యాలలో ఎదురుదెబ్బ తగలడంతో.. ఇక ఆమెను టార్గెట్ చేయాలని టీడీపీ డిసైడైంది. ఇప్పటికే అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసిన టీడీపీ.. ఇక వచ్చే ఎన్నికల్లో ఆమె భరతం పెట్టాలని నిర్ణయించింది. అయితే నగరిలో సరైన క్యాండేట్ లేరు కాబట్టి.. ముందు అభ్యర్థిని వెతికే పనిలో పడింది.

రోజాను మించిన గ్లామర్ తారగా పేరున్న వాణివిశ్వనాథ్ ను దువ్వుతోండి టీడీపీ. ఇప్పటికే నగరి టీడీపీ నేతలు చెన్నైవెళ్లి సంప్రదింపులు జరిపారు. వాణి కూడా పాలిటిక్స్ పై ఆసక్తిగా ఉండటంతో.. ఇక త్వరలోనే ఆమె చేరికకు రంగంసిద్ధమవుతోంది. వాణి విశ్వనాథ్ ను విస్తృతంగా జనంలోకి తిప్పి నగరి నియోజకవర్గ ప్రజలందరి మనసులో ముద్ర పడేలాచేయాలని సైకిల్ పార్టీ ప్లాన్ రెడీ చేసింది.

రోజాను సర్వభ్రష్టత్వం చెందించాల్సిందేనని టీడీపీ సీనియర్లు పట్టుదలగా ఉన్నారు. చంద్రబాబు సానుభూతి చూపిస్తున్నావారు మాత్రం వదలడం లేదు. రోజా తనకు తాను గాడ్ మదర్ అనుకుంటోందని ఆమెను నామరూపాల్లేకుండా చేయాలని వాళ్లు చూస్తున్నారు. అందుకే బాబు వద్దన్నా అసెంబ్లీ బహిష్కరణ అమలుచేశారు. ఇప్పుడు ఏకంగా పాలిటిక్స్ నుంచే తెరమరుగుచేయాలని ట్రై చేస్తున్నారు. వాణి వస్తే కచ్చితంగా రోజా ఓడిపోతోందని టీడీపీ సీనియర్లు నమ్మకంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు:

ఇంకా కోలుకోని కాంగ్రెస్

వైసీపీకి ముందే గొయ్యి తవ్విన కన్నబాబు.

కాకినాడలో కింగ్ ఎవరు..?