పి.వి. సింధుకు ఫైన‌ల్  మ్యాచ్ లో ఎల్లోకార్డు

PV sindhu gets Yellow card in world Badminton championship final match

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బ్యాడ్మింట‌న్  వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన పి.వి. సింధు మ్యాచ్ లో ఎల్లో కార్డు అందుకున్న విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మైదానంలో సింధు ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేక‌పోవ‌డం, బ్యాడ్మింట‌న్ చ‌ట్టాల‌ను ఉల్లంఘించింద‌న్న కార‌ణంతో అంపైర్ సింధుకు ఎల్లోకార్డ్ చూపించారు. జ‌పాన్ కు చెందిన నోజోమి ఒకుహారాతో  హోరాహోరీగా జరిగిన ఫైన‌ల్ లో సింధు ఓట‌మి పాల‌యింది. కానీ ఆమె పోరాడిన తీరు మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ర‌జ‌త ప‌త‌కంతో స‌రిపెట్టుకున్న సింధు పో్రాట‌స్ఫూర్తిపై సామాన్యుల‌తో  పాటు సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. సింధునే స్వ‌ర్ణ‌మ‌ని, ఆమెకు మ‌రో స్వ‌ర్ణంతో ప‌నిలేద‌ని అంద‌రూ కొనియాడారు.

అయితే ఈ మ్యాచ్ లో కొ్న్నిసార్లు అస‌హ‌నానికి లోనైన సింధు బ్యాడ్మింట‌న్ నియమాల‌ను ఉల్లంఘించింది.  ప్ర‌త్య‌ర్థి కోర్టులోకి రాకెట్ విస‌ర‌టం, అంపైర్ అనుమ‌తి లేకుండా మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డం, కావాల‌ని ఆట‌ను ఆల‌స్యం చేయ‌టం వంటివి చేసింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై అంపైర్ ఆమెకు ఎల్లోకార్డు చూపించారు. ప్లేయ‌ర్ రెండు ఎల్లోకార్డులు అందుకుంటే అది రెడ్ కార్డుకు దారితీస్తుంది. అటు సింధుకు ఎల్లోకార్డు చూపించ‌టంపై ట్విట్ట‌ర్ లో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇటువంటివి ప‌ట్టించుకోకుండా ముందుకెళ్లాల‌ని కొంద‌రు సింధుకు సూచించ‌గా, మ‌రికొంద‌రు మాత్రం అంపైర్ ఎవ‌రో స్కూల్ టీచ‌ర్ లా ఉన్నాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

 మరిన్ని వార్తలు:

మైదానంలోనే మాజీ కెప్టెన్ నిద్ర‌

శిఖ‌ర్ ధావ‌న్‌కు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్

టీ 10 క్రికెట్లోకి సెహ్వాగ్