శిఖ‌ర్ ధావ‌న్‌కు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్

shikhar dhawan getting huge fan following

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీలంక‌తో మొద‌టి వ‌న్డేలో 132 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచిన క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్ త‌ర్వాత శిఖ‌ర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. శిఖ‌ర్ ఇష్టాయిష్టాలు , వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలుసుకోవ‌టానికి అంతా ఆస‌క్తి చూపిస్తున్నారు. టీమిండియా స‌భ్యులంతా గ‌బ్బ‌ర్ అని ముద్దుగా పిలుచుకునే శిఖ‌ర్ త‌న ఆస‌క్తుల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ సినిమాలు ఎక్కువ‌గా చూసే గ‌బ్బ‌ర్ కు అమీర్ ఖాన్‌, క‌రీనా క‌పూర్ ఇష్ట‌మైన హీరో హీరోయిన్ల‌ట‌.

1976లో హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జాన్‌. జి. ఎవిల్ స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రాకీ సినిమా శిఖ‌ర్ త‌న ఫేవ‌రెట్ మూవీ అని చెప్పాడు. ఈ సినిమాను ఇప్ప‌టిదాకా ఎన్నిసార్లు చూశానో లెక్కేలేద‌న్నాడు శిఖ‌ర్‌. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను విప‌రీతంగా అభిమానిస్తాడ‌ట‌. ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానం అన్నా గ‌బ్బ‌ర్ కు చాలా ఇష్టం. ఇక వ్య‌క్తిగ‌త విష‌యాల కొస్తే…శిఖ‌ర్ ధావ‌న్ భార్య పేరు ఆయేషా ముఖ‌ర్జీ. మెల్ బోర్న్ కు చెందిన ఆయేషాను శిఖ‌ర్ ప్రేమించి పెళ్లిచేసుక‌న్నాడు. ఆమెకు అంత‌కుముందే వివాహ‌మై ఇద్ద‌రు పిల్ల‌ల త‌ర్వాత విడాకులు తీసుకున్నారు.

శిఖ‌ర్ కు ఆయేషా ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌య‌మ‌యింది. వీరికి ఇప్పుడో బాబు. 2010లో తొలిసారి టీమీండియాలో చోటు ద‌క్కించుకున్న శిఖ‌ర్ తొలినాళ్ల‌లో జ‌ట్టులోకి వ‌స్తూ పోతూ ఉన్నాడు. త‌ర్వాత నిల‌క‌డైన ఆట‌తీరుతో ఓపెనింగ్ ప్లేస్ లో కుదురుకున్నాడు. ఇటీవ‌ల కాలంలో బాగా రాణిస్తున్న శిఖ‌ర్ మున్ముందు ఎన్నో రికార్డులు అధిరోహిస్తాడ‌ని క్రీడా విశ్లేష‌కులు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

అఖిల్ ‘హలో’ టీజర్ ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్… వీడియో

‘అర్జున్‌ రెడ్డి’కి అదే పెద్ద మైనస్‌ అయ్యేలా ఉంది

‘బాహుబలి’తో చైతూ ‘యుద్దం శరణం’కు సంబంధం ఏంటి?