బాలయ్య 102లో నయన్‌ షాకింగ్‌ రోల్‌

Nayanthara Shocking Roll In Balayya 102 Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

సీనియర్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ నయనతార. ఇప్పటికే ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో నయనతారతో కలిసి నటించిన బాలకృష్ణ తాజాగా తన 102వ చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. బాలయ్య 102 చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు. ఆ ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఒక్క ముద్దుగుమ్మ నయనతార. ఇటీవలే ఈ చిత్రంలో నయన్‌ లుక్‌ ఎలా ఉంటుందో తేలిపోయింది. బాలయ్య 102 షూటింగ్‌ సందర్బంగా నయన్‌ మేకోవర్‌ స్టిల్‌ను స్టైలిస్ట్‌ నీరజ కోన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార ఒక పిల్లాడి తల్లిగా కనిపించబోతుందట. బాలకృష్ణ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అంటే తండ్రి, కొడుకుగా బాలయ్య కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రకు భార్యగా నయనతార కనిపించనుంది. నయనతార కొడుకు పెద్ద వాడు అయ్యి కొడుకు బాలకృష్ణగా మారతాడట. ఇలాంటి పాత్రలు చేసేందుకు స్టార్‌ హీరోయిన్స్‌ ఆసక్తి చూపించరు. కాని నయన్‌ మాత్రం ఇలాంటి చిత్రాల్లో నటించేందుకు ముందు ఉంటుంది. కాకుంటే కాస్త అధిక పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. బాలయ్య 102 చిత్రంతో పాటు చిరంజీవి 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో కూడా హీరోయిన్‌గా నటించనుంది.

మరిన్ని వార్తలు:

నెల ముందే పూర్తి చేసిన ఎన్టీఆర్‌

‘సైరా నరసింహారెడ్డి’ పూర్తి వివరాలు..!